Anupama Shocking Revelation: ఆ ఒక్కమాటతో అక్కడే వాంతులు చేసుకున్న:అనుపమ
అక్కడే వాంతులు చేసుకున్న:అనుపమ

Anupama Shocking Revelation: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సి నిమాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. కంటెంట్ ఉన్న చిత్రాలనే సెలెక్ట్చసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల 'లాక్ డౌన్' మూవీతో అలరించిన అనుపమ.. ప్రస్తుతం 'క్రేజీ కళ్యాణం' ప్రాజెక్టులో బిజీగా ఉంది. ఇందులో తరుణ్ భాస్కర్, రాజువెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి, వీకే నరేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బూసమ్ జగన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే అనుపమ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచే సుకుంది. 'కార్తికేయ?' షూటింగ్ టైంలో సెట్లో ఒక చిన్న మేకపిల్ల' ఉండేది. ఖాళీ సమయాల్లో దానితో ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని, అయితే ఒకరోజు షూటింగ్ లంచ్ బ్రేక్ లో మాకు మటన్ బిర్యానీ వడ్డించారు. నేను తింటున్న సమయంలో నా అసిస్టెంట్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. 'మేడం, మీరు ఇప్పుడు తింటున్నది మీరు ఇందాక ఆడుకున్న మేకపిల్లనే' అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే ఒక్క సారిగా గుండె తరుక్కుపోయింది. అక్కడి కక్కడే వాంతులు చేసుకున్న. ఆ విషయం నన్ను మానసికంగా ఎంతో గాయపరిచింది. అప్పటినుంచి నేను మటన్ ముట్టుకోవడమే మానేశా. 'కార్తికేయ2' షూటింగ్ పూర్తయి నప్పటి నుంచి దాదాపు ఇన్నేళ్ల పాటు నేను మాంసాహారానికి దూరంగా ఉన్న' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనుపమ చేసిన ఈ కామెంట్సే నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

