తమన్నా షాకింగ్ కామెంట్స్..

Tamannaah Makes Shocking Comments: ఎప్పుడూ తన వృత్తిపరమైన విషయాలకే ప్రాధాన్యత ఇచ్చే తమన్నా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ, బ్రేకప్‌ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో రెండుసార్లు హార్ట్ బ్రేక్ కు గురయ్యానని ఆమె వెల్లడించారు.

డేంజరస్ రిలేషన్ - తమన్నా ఏమన్నారంటే?

తమన్నా తన గత సంబంధాల గురించి మాట్లాడుతూ రెండు దశలను వివరించారు. యుక్తవయసులో ఉన్నప్పుడు మొదటిసారి ప్రేమలో పడ్డానని, కానీ కెరీర్, లక్ష్యాల కోసం ఆ బంధానికి స్వస్తి పలికానని చెప్పారు. ఆ తర్వాత మరొకరితో రిలేషన్‌లో ఉన్నానని, అయితే కొన్నాళ్లకే అతను తనకు సరైన జోడీ కాదని అర్థమైందని పేర్కొన్నారు. "అలాంటి బంధంలో కొనసాగడం నా వ్యక్తిత్వానికి, నా భవిష్యత్తుకు ప్రమాదకరం అనిపించింది. అందుకే ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికాను" అని ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

విజయ్ వర్మతో బ్రేకప్ నిజమేనా?

తమన్నా ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించేనని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

లస్ట్ స్టోరీస్ 2 సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. తమన్నా పెళ్లికి సిద్ధమవ్వగా, విజయ్ మాత్రం కెరీర్‌పైనే దృష్టి పెట్టాలనుకోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని సమాచారం. తాజా ఇంటర్వ్యూలో ఆమె "ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం" అని చెప్పడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

సినిమాలతో బిజీగా మిల్కీ బ్యూటీ

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా, తమన్నా తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. గతేడాది ఓదెలా 2తో ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విశాల్ సరసన పురుషన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక డామినేటింగ్ వైఫ్ పాత్రలో సరికొత్తగా కనిపించబోతున్నట్లు ఇటీవల విడుదలైన ప్రోమో ద్వారా స్పష్టమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story