కమల్ హాసన్ ఏమన్నారంటే..?

Kamal Haasan Reacts: చిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి పడగ విప్పింది. భారీ అంచనాలతో రూపొందిన జననాయగన్‌ చిత్రం విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో దావానలంలా మారింది. ఈ ఉదంతంపై దక్షిణాది అగ్ర హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, చిత్ర నిర్మాతలు కఠిన చర్యలకు దిగారు. ఈ లీకేజీపై విశ్వనటుడు కమల్ హాసన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు తీరును తప్పుబట్టారు.

‘‘సినిమా లీక్ అవ్వడం అనేది యాదృచ్ఛికం కాదు, ఇది వ్యవస్థ వైఫల్యం. సెన్సార్ బోర్డులో జరిగిన విపరీతమైన జాప్యం వల్లే పైరసీకి అవకాశం చిక్కింది’’ అని ఆయన తెలిపారు. పైరసీ అనేది రాజకీయాలకు అతీతమైనదని, ఇది వందలాది మంది కళాకారుల శ్రమపై జరిగే దాడి అని కమల్ మండిపడ్డారు. గతంలో తన సినిమాలకు అండగా నిలిచినట్లే, ఇప్పుడు కూడా సినిమా ప్రేమికులంతా ఏకమై జననాయగన్ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తీవ్ర దిగ్భ్రాంతిలో చిరంజీవి, రజనీకాంత్

మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందిస్తూ.. సినిమా దురదృష్టవశాత్తూ లీక్ కావడం తనను ఎంతో ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. మరోవైపు, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ వార్త విని షాక్‌కు గురయ్యానని, దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మేకర్స్ సీరియస్ వార్నింగ్

సినిమా లీక్ అయిన నేపథ్యంలో దర్శకనిర్మాతలు అప్రమత్తమయ్యారు. ఆన్‌లైన్ నుండి పైరసీ లింక్స్‌ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లీక్ అయిన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా నేరమని, అభిమానులు అటువంటి పనులు చేయవద్దని కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story