పూర్తిగా కుళ్లిపోయిన శరీరం!

పాకిస్తాన్‌కు చెందిన బుల్లితెర నటి హుమైరా అస్గర్‌ అలీ చనిపోయింది. ఆమె మృతదేహాన్ని కరాచీలోని ఓ ఫ్లాట్‌లో గుర్తించారు. చనిపోయి రెండు వారాలు అవుతుందని పోలీసులు అంచనా వేశారు కానీ ఆమె మరణించి తొమ్మిది నెలలు దాటిందని నిర్ధారణ అయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె చనిపోయి ఉంటుందని, శరీరం పూర్తిగా కుళ్లిపోయిందని కరాచీకి చెందిన సర్జన్‌ డాక్టర్‌ సుమయ్యా సయ్యిద్‌ చెప్పారు. పోస్టుమార్టం చేసిన తర్వాత ఆమె సుమారు తొమ్మిది నెలల కిందట మరణించినట్టు నిర్ధారణకు వచ్చారు. హుమైరా కాల్‌డేటాను పరిశీలిస్తే ఆమె తన చివరి ఫోన్‌ కాల్‌ను లాస్టియర్‌ 2024 అక్టోబర్‌లో చేసిందట! పొరుగున ఉన్నవారు కూడా సెప్టెంబర్‌ తర్వాత ఆమెను చూడలేదని చెప్పారు. కరెంట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో లాస్టియర్‌ అక్టోబర్‌లో హుమైరా ఫ్లాట్‌కు కరెంట్‌ కట్‌ చేశారు. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్డు కూడా పాడైపోయింది. మరో విషాదమేమిటంటే హుమైరా మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించడం. చివరకు సోదరుడు బాడీని రిసీవ్‌ చేసుకున్నాడట! వెరిఫికేషన్‌ కోసం డీఎన్‌ఏ టెస్ట్‌ చేశారు. బాడీ హుమై-రాదేనని గుర్తించారు. హుమై-రా ఏడేళ్ల కిందట లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్లింది. అప్పట్నుంచి ఫ్యామిలీకి దూరంగానే ఉంటోంది. ఫ్లాట్‌ రెంట్ కట్టడం లేదని ఓనర్‌ కంప్లయింట్‌ చేయడంతో పోలీసులు హుమైరా ఫ్లాట్‌ తలుపులు తెరిచారు. 2015లో హుమైరా టెలివిజన్‌లో అడుగుపెట్టింది. జ‌స్ట్ మ్యారీడ్‌, ఇషాన్ ఫ‌ర్మోష్‌, గురు, చాల్ దిల్ మేరీ టీవీ షోల్లో న‌టించింది. జిలేబీ, ల‌వ్ వ్యాక్సిన్ సినిమాల్లోనూ నటించింది. త‌మాషా ఘ‌ర్ రియాల్టీ షో హుమైరాకు మంచి పేరు తెచ్చింది. రెండేళ్ల కిందట ఆమెకు బెస్ట్ ఎమ‌ర్జింగ్ టాలెంట్, రైజింగ్ స్టార్ అవార్డు ద‌క్కింది.

Updated On 11 July 2025 4:24 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story