Niharika Konidela: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన సెన్సేషనల్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు' జాతీయ స్థాయిలో సత్తా చాటింది! 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ చిత్రం ఏకంగా రెండు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది.

ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా నిలవడంతో పాటు, బెస్ట్ మేకప్ విభాగంలోనూ 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై మూవీ టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ... 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డులు రావడం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాను నిర్మించడం తన కెరీర్‌లోనే అత్యుత్తమ నిర్ణయమని, తమ కుటుంబం తర్వాత ఇప్పుడు తన సినిమా కూడా నేషనల్ అవార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. తమ సినిమాకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం మొదటి నుంచే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ సహా చిత్రబృందం అంతా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story