ది ఫ్యామిలీ మ్యాన్ ఈజ్ బ్యాక్

The Family Man: ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మళ్లీ వచ్చే సింది. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చే సుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ముచ్చటగా మూడోసారి అలరించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇందులో మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్ర పోషించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'ఫ్యామిలీమ్యాన్: సీజన్3' త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ కానుంది.

ఈ క్రమంలో తాజాగా టీమ్ సర్ప్రైజ్ ఇస్తూ.. గ్లింప్స్న రిలీజ్ చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియోలో 'మీరేం చేస్తుంటారంటూ..' ఓ వ్యక్తి మనోజ్ బాజ్ పాయ్ అడగ్గా.. 'నేను లైఫ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలరు’ అంటూ తివారీ అతడికి రిప్లై ఇచ్చాడు. 'ది ఫ్యామిలీ మ్యాన్' ఈజ్ బ్యాక్.. న్యూ సీజన్ కోసం వేచి ఉండండి అంటూ వీడియోను ముగించింది. ఇందులో పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ నార్త్ ఈస్ట్ బ్యా క్ప్లో రాబోతుండగా.. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా భారీస్థాయిలో ఉండనున్నట్లు టీమ్ పేర్కొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story