కారణం చెప్పిన అల్లు అరవింద్

‘The Girlfriend’ Pre-Release Event Cancelled: రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. దీనికి కారణం నటి రష్మిక మందన్న వేరే షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ సరదాగా మాట్లాడారు. ‘‘ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను పిలవాలని మొదట అనుకున్నారట. కానీ, రష్మిక రాలేకపోతున్నప్పుడు, విజయ్ వచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది’’ అని నవ్వుతూ చమత్కరించారు.

రష్మికకు జాతీయ అవార్డు ఖాయం

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది డబ్బు పరంగా తనకు కొంచెం రిస్క్ అని అల్లు అరవింద్ ఒప్పుకున్నారు. అయినా.. ఈ సినిమాలో రష్మిక చాలా బాగా నటించిందని, ఆమె నటన చూస్తే తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం తనకు ఉందని మెచ్చుకున్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను బాగా తీశారని తెలిపారు.

రష్మిక సందేశం

షూటింగ్ కారణంగా రాలేకపోయిన రష్మిక.. వీడియో ద్వారా తన సందేశాన్ని పంపారు. ది గర్ల్‌ఫ్రెండ్ తన మొదటి సోలో చిత్రం అని, అందుకే ఇది తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. మంచి కథలకు ప్రేక్షకులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story