బాధ్యత ఇండస్ట్రీదే

Gaddar Awards: జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ లో జరగనున్న గద్దర్ అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ, మీడియాపై ఉందన్నారు దిల్ రాజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చేరువ చేయాలని కోరారు. ప్రతి బెస్ట్ ఫిల్మ్ కి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా నాలుగు అవార్డులు అందజేయబోతున్నామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చేరువ చేయాలని కోరుతున్నా. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు ఏడాదికి మూడు చొప్పున బెస్ట్ ఫిల్మ్ అవార్డులు ఇవ్వబోతున్నాం. ప్రతి బెస్ట్ ఫిల్మ్ కి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా నాలుగు అవార్డులు అందజేయబోతున్నాం. అలాగే 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులు అనౌన్స్ చేయగా, వారందరికీ ఇన్విటేషన్స్ ఇప్పటికే పంపించాం. పద్నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎఫ్ఎసీ చైర్మన్ కోరుతున్నా అని అన్నారు.
