అఖండ--2 ట్రైలర్

Akhanda 2 Trailer Raises Expectations: నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా ట్రైలర్ విడుదలైంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో ఒక భారీ ఈవెంట్‌లో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్‌లో బాలకృష్ణ విశ్వరూపం,పవర్‌ఫుల్ డైలాగులు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా, "సనాతన హైందవ ధర్మం" నేపథ్యాన్ని, అలాగే "దేశం జోలికి వస్తే దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్" వంటి డైలాగులు సినిమాపై అంచనాలను పెంచాయి.

ఈ సీక్వెల్‌ను బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం.. బాలయ్య సరసన ఈ మూవీలో సంయుక్త నటించింది.14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, నందమూరి కుటుంబం నుంచి ఎం. తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించడం అదనపు హైప్ తీసుకొచ్చింది.

ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సీక్వెల్‌ను ఈసారి 3D వెర్షన్లో కూడా విడుదల చేయబోతున్నారు.ట్రైలర్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ జోరు మరింత పెరిగింది.ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story