చిరుకు బన్నీ బర్త్ డే విషెస్..

Bunny Sends Birthday Wishes to Chiru" గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి అల్లు అర్జున్ ట్వీట్ ఫుల్ స్టాప్ పెట్టింది. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానుల్లో కూడా ఉత్సాహం నింపింది. చిరు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఒక ఫంక్షన్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసిన ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే టు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ ఇటు అల్లు ఫ్యాన్స్‌కు అటు మెగా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించింది.

చిరంజీవిపై అల్లు అర్జున్ ప్రశంసలు

కొద్ది రోజుల క్రితం ముంబైలో జరిగిన 'వేవ్స్' సమ్మిట్‌లో అల్లు అర్జున్ చిరంజీవిని తన జీవితంలో గొప్ప ప్రేరణగా అభివర్ణించారు. ‘‘సినిమానే నా ప్రపంచం. నాకు మరో ఆలోచన లేదు. ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని తెలిపారు. తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్‌తో పాటు తన మామయ్య చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ అని.. ఆయన తనను ఎంతగానో ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story