'The Paradise' Teaser: న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ది పారడైజ్” టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఆలస్యం కానుందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోందని, అనుకున్న సమయానికి విడుదల కాదేమోనని వార్తలు వచ్చాయి. అయితే, ఈ అనుమానాలన్నింటికీ తెరదించుతూ ఆగస్టు 6వ తేదీన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో సినిమా ప్రమోషన్స్ అధికారికంగా ప్రారంభమైనట్లే.

సుమారు 1 నిమిషం 35 సెకన్ల నిడివితో వస్తున్న ఈ టీజర్ ఎడిటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. "1 నిమిషం 35 సెకన్ల విద్వాంసం సిద్ధంగా ఉంది. ఆగస్టు 6న #TheParadise టీజర్ రాబోతోంది. జడల జమానా కోసం సిద్ధంగా ఉండండి" అని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీజర్ ద్వారా ప్రచారాన్ని వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట “ఆయా షేర్” అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 200 మిలియన్లకు పైగా డిజిటల్ వీక్షణలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన షూటింగ్ భాగాన్ని వచ్చే నెలలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది పారడైజ్” చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాని ‘జడలు’ అనే రగ్గడ్ పాత్రలో కనిపిస్తుండగా, కాయదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. మోహన్ బాబు, సోనాలీ కుల్కర్ణి, రాఘవ్ జుయాల్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, నటి కీర్తి సురేష్ ఒక ప్రత్యేక పాటలో అలరించనుంది..

PolitEnt Media

PolitEnt Media

Next Story