మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్

The Raja Saab Jathara: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహిస్తోంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇదే వేదిక వద్ద ఏర్పాటు చేసిన 220 అడుగుల భారీ కటౌట్ ఇప్పటికే ఒక రికార్డుగా నిలిచింది.

సాధారణంగా ప్రభాస్ మీడియాకు, బహిరంగ వేడుకలకు దూరంగా ఉంటారు. సలార్ చిత్రానికి ఎటువంటి ఈవెంట్ జరగలేదు. కల్కి కోసం కేవలం బుజ్జి కారు పరిచయ వేడుకలో మాత్రమే కనిపించారు. అయితే అభిమానుల కోరిక మేరకు సుమారు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నేరుగా స్టేజ్ మీదకు రానున్నారు.

ఓవర్సీస్ బుకింగ్స్ జోరు

సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతున్నాయి. నిర్మాత ఎస్‌కేఎన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. హారర్, కామెడీ మేళవింపుతో ప్రభాస్‌ను విభిన్నమైన లుక్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రేసులో రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story