The Raja Saab Premiere Show: ది రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ రేటు వెయ్యి రూపాయలు
టికెట్ రేటు వెయ్యి రూపాయలు

The Raja Saab Premiere Show: ది రాజా సాబ్' రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లైన్ క్లియర్ అయ్యింది. ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.మల్టీప్లెక్స్ లలో రూ.200 అదనపు పెంపు (మొత్తం సుమారు రూ.377).రోజుకు గరిష్టంగా 5 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది
తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై మొదట కొంత సందిగ్ధత ఉన్నా,హైకోర్టులో నిర్మాతలకు ఊరట లభించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ధరల నియంత్రణ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది. టికెట్ ధరల పెంపు విజ్ఞప్తిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖను కోర్టు ఆదేశించింది.జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి కోరారు.
ప్రీమియర్ షో ధరలు మల్టీప్లెక్స్ లో రూ.1,000, సింగిల్ స్క్రీన్స్ లో రూ.800గా ఉండాలని కోరారు.రెగ్యులర్ షోలపై సింగిల్ స్క్రీన్స్ లో రూ.102, మల్టీప్లెక్స్ లో రూ.132 అదనపు పెంపు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు (GO) వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి.ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్ అల్ రెడీ ఊపందుకున్నాయి. తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే BookMyShow, Paytm వంటి యాప్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.

