Trivikram: సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు... అది మన అందరి భావోద్వేగాల ప్రయాణం! అలాంటి ఒక సుందరమైన కుటుంబ కథా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది 'విశ్వనాథ్ అండ్ సన్స్'!

సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో... సూర్య నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలై, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ వేడుకలో సినిమా టీమ్ ఆనందం తారస్థాయికి చేరింది.

ఈ విజయ వేడుకలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులేనని కొనియాడారు. ఈ కథ తన హృదయానికి చాలా దగ్గరైందని చెబుతూ... ఈ చిత్రంలోని నలుగురు ప్రధాన స్తంభాలను ప్రశంసించారు.ఒక పిల్లర్‌గా హీరో సూర్య, మరో పిల్లర్‌గా రాధిక, ఆ తర్వాత రవీనా టాండన్, మమితా బైజులు అద్భుతమైన నటన కనబరిచారని కొనియాడారు. ముఖ్యంగా హీరో సూర్య పాత్ర ఎంత కష్టమైనదో చెబుతూ... ఎక్కడా అతి చేయకుండా, అండర్ పెర్ఫార్మెన్స్‌తో సూర్య అద్భుతంగా నటించారని, ఆయన సినిమా నిర్మాణంలో తమ ప్రొడక్షన్ పేరు కూడా ఉండటం చాలా సంతోషంగా ఉందని త్రివిక్రమ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ... ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలకు మరోసారి పెద్దపీట వేశారని, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. కొన్ని సినిమాలను కేవలం వసూళ్లతో కొలవలేమని, ప్రేక్షకులు సినిమా చూసి పొందిన అనుభూతిలోనే అసలు విజయం దాగుంటుందని ఆయన మనస్పూర్తిగా చెప్పారు. ఈ చిత్ర విజయ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నటి రవీనా టాండన్ అనగా... రోజురోజుకూ సినిమా వసూళ్లు పెరుగుతుండటం పట్ల దర్శక నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story