అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. "K-ర్యాంప్" మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ గ్లింప్స్ చివరలో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ చూస్తే " K-ర్యాంప్" తో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని తెలుస్తోంది.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

Updated On 14 July 2025 5:32 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story