సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌

సినీమా రంగ కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌.కె.నారాయణ డిమాండ్‌ చేశారు. పెద్ద బడ్జెట్‌ సినిమాలకు 30 శాతం, చిన్న చిత్రాలకు 15 శాతంవేతనాలు పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగేవరకు సిపిఐ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని సినీమా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నరసింహాతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలుగు సినీమా కార్మికులు తమకు వేతనాలు వేతనాలు పెంచమంటే ముంబాయి నుంచి సిసీ కార్మికులను తీసుకువచ్చి పని చేయించుకుంటామని సినీ నిర్మాతలు బేదిరింపులకు పాల్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక్కడి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సిపిఐ ఉద్యమంలో ప్రత్యేక్షంగా పాల్గొన్నడమే కాకుండా ఎంత వరకైనా వెళ్లుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగ సినీమా రంగంలో రాష్ట్రంలో కేవలం 10 కుటుంబాలు , థియేటర్లు 4 కుటుంబాల చేతుల్లో ఉన్నాయని వారే మొత్తం ఆడిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రొత్సహాం అందించాలన్నారు. వందల కోట్లతో సమాజాన్ని చెడుమార్గం పట్టించేలా తీస్తున్న చిత్రాలకు ఏలాంటి పరిస్థితుల్లో రాయితీలు ఇవ్వరాదని, టికెట్ల పెంపుకు అనుతులు ఇవ్వరాదనిపేర్కొన్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలను పిలిచి మాట్లాడే ముఖ్యమంత్రి సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.ప్రభుత్వానికి పక్షపాతం సరికాదని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకూడ చూడాలని కోరారు.

చిరంజీవి నైతికతకే వదలి వేస్తున్నా…

గతంలో ఓ సందర్భంగా సినీ నటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల అప్పుడే క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నానని నారాయణ తెలిపారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. చిరంజీవిని ఉద్దేశించి గతంలో తను చేసిన వ్యాఖ్యల పట్ల అప్పుడే క్షమాపణలు చెప్పడంతో ఈ ఆంశం ముగిసిపోయిందన్నారు. కానీ చిరంజీవి మళ్లీ ఆ ప్రస్తావన తేవడం, ఆ వీడియోలను వైరల్‌ చేయడం సరికాదన్నారు. ఈ అంశాన్ని చిరంజీవి నైతికతకు, విజ్ఙతకు వదిలి వేస్తున్నాని నారాయాణ పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story