Jagapathi Babu Praises Megastar Chiranjeevi: టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా నారీ నారీ నడుమ మురారి అనిపించుకుని, సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్‌ఫుల్ విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు జగపతిబాబు. తాజాగా ఆయన.ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిలోని గొప్ప గుణాన్ని, ఆయనతో తనకున్న 35 ఏళ్ల నాటి అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

ఇంటికి వెళ్లగానే ఆత్మీయ స్వాగతం.. ఫస్ట్ లుక్‌కే మెగాస్టార్ ఫిదా.

జగపతిబాబు హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ల్యాండ్‌మార్క్ మూవీ సింహ స్వప్నం. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టాల్సిందిగా అడగడానికి జగపతిబాబు, ఆయన తండ్రి.. ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారట. అప్పట్లో చిరంజీవి వరుస సినిమాలతో డైరీ ఖాళీ లేనంత బిజీగా, ఇండస్ట్రీలో పీక్ స్టార్‌డమ్‌లో ఉన్నారు. అయినప్పటికీ, వారిద్దరినీ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. జగపతిబాబును చూడగానే చిరంజీవి ముగ్ధులై.. "చాలా అందంగా ఉన్నావు" అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారట. అంతేకాదు వారు అడగడమే ఆలస్యం వెంటనే ఒప్పుకుని సింహ స్వప్నం ఓపెనింగ్‌కు వచ్చి క్లాప్ కొట్టారని జగపతిబాబు ఆ నాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్.. పెద్ది సినిమాతో ఫోన్ కాల్..

కాలం మారింది.. జగపతిబాబు హీరో నుండి మోస్ట్ వాంటెడ్ విలన్‌గా రూపాంతరం చెందారు. అయితే ఆనాటి ఆత్మీయత మాత్రం అలాగే ఉందనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ అని జగపతిబాబు చెప్పారు. ఆ సంఘటన జరిగిన దాదాపు 35 సంవత్సరాల తర్వాత, రీసెంట్‌గా విడుదలైన పెద్ది సినిమాలో జగపతిబాబు నటన, ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రను చూసి చిరంజీవి ఫిదా అయిపోయారట. వెంటనే జగపతిబాబుకు స్వయంగా ఫోన్ చేసి, ఆయన నటనను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారట. ఒకరు స్టార్‌డమ్‌లో ఉన్నప్పుడు ఎంత ఆదరించారో మూడు దశాబ్దాల తర్వాత కూడా తోటి నటుడి ప్రతిభను గుర్తించి అంతే గౌరవాన్ని ఇవ్వడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమంటూ చిరంజీవిలోని డౌన్-టు-ఎర్త్ స్వభావాన్ని జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో కొనియాడారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

PolitEnt Media

PolitEnt Media

Next Story