Genelia: ఆ హీరోతో పెళ్లి జరిగిందని.. కావాలనే ప్రచారం చేశారు
కావాలనే ప్రచారం చేశారు
Genelia: స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి జెనీలియా... టాలీవుడ్ ప్రేక్షకులను మనసు దోచిన ఈ అమ్మడు. బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రా. రంభించి సెలెక్టివ్ ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న సితారే జమీన్ పర్' అనే చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జెనీలియా తన గతానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయా న్ని బయట పెట్టింది. దాదాపు 14 ఏళ్ల క్రితం తనకు నటుడు జాన్ అబ్రహామ్కు పెళ్లయిందనే వదంతులు వచ్చాయని చెప్పుకొచ్చింది. వాటిని కొందరు కావాలనే సృష్టిం చారని తెలిపింది. వాళ్ళు ఎవరో తనకు తెలుసనీ అంటోంది. సెట్ ల్లోనే తమ పెళ్లి జరిగిందని చాలా పెద్ద ప్రచార మే చేశారంటోంది. అలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని తెలిపింది. ఆ రూమర్స్ తర్వాత ఏడాదికే బాలీవుడ్ హీరో, తన స్నేహితుడు రితేశ్ దేశ్ముఖ్ ను వివాహం చేసు కున్న జెనీలియా ఆ పుకార్లకు చెక్ పెట్టింది.
