Ananth Sriram's Sensational Remarks: వసూళ్ల వరదపై బురద చల్లాలనుకున్నారు.. పెద్ది ఈవెంట్‌లో అనంత్ శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్
అనంత్ శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్

Ananth Sriram's Sensational Remarks: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.. బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. నిన్న రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా 'పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' నిర్వహించారు. అభిమానుల కోలాహలం, సినీ ప్రముఖుల సందడితో ఈ వేడుక కంటికి పండగలా సాగింది. అయితే, ఈ ఈవెంట్‌లో ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.
స్టేజ్ పైకి వచ్చిన అనంత్ శ్రీరామ్.. తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ఆయన మాట్లాడుతూ.. "‘పెద్ది’ కేవలం సినిమా కాదు.. ఇదొక వసూళ్ల వరద. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఈ విజయపు వరద మీద బురద చల్లాలని కొందరు చూశారు. కానీ, అలాంటి వాళ్ల సరదా తీర్చేసిన మెగా అభిమానులు మీరు. అందుకే మీకు సెల్యూట్ చేయడానికి, చప్పట్లు కొట్టడానికి మా ‘పెద్ది’ బృందం మొత్తం మీ ముందుకు వచ్చింది" అంటూ వేదికపై ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు, ప్రస్తుత కమర్షియల్ సినిమాల ట్రెండ్‌పై అనంత్ శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "కేవలం వందల మందిని ఊచకోత కోస్తేనో.. లేక గాల్లో వాహనాలను పైకి లేపితేనో చప్పట్లు కొట్టడం కాదు.. సినిమాలో మంచి ఉద్వేగం, బలమైన కథాబలం ఉంటే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘పెద్ది’ సినిమాతో మీరంతా నిరూపించారు" అంటూ సినిమా కథను, బుచ్చిబాబు టేకింగ్‌ను ఆకాశానికెత్తేశారు.
ఇక లేటెస్ట్ అప్‌డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమా సక్సెస్‌తో రామ్‌చరణ్ క్రేజ్ మరోస్థాయికి చేరింది. రూ. 420 కోట్ల మార్కును దాటి.. లాంగ్ రన్‌లో మరిన్ని వసూళ్లను సాధించే దిశగా ‘పెద్ది’ దూసుకుపోతోంది. ఈ మెగా సక్సెస్‌తో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

