Tamannaah's Shocking Remarks: సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి తమన్నా భాటియా. సౌత్ టూ బాలీవుడ్.. ఎన్నో భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఈ మిల్కీ బ్యూటీ.. తాజాగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లో మహిళా నటీమణులకు అంతగా గుర్తింపు, ప్రశంసలు ఉండవని.. ఇక్కడ కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఓపెన్ అయ్యారు తమన్నా. హిందీ చిత్ర పరిశ్రమలో నటనకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు లేదా గ్లామర్ పాత్రలు.. ఇలా ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ నటీనటులకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

కానీ సౌత్ కమర్షియల్ సినిమాలకు ఒక నిర్దిష్టమైన ఫార్మాట్ ఉంటుందని.. ఇక్కడ పితృస్వామ్య భావజాలం ఎక్కువంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లను చూసే విధానం అంత ప్రశంసనీయంగా అనిపించదని.. ఇది కేవలం తన వ్యక్తిగత అనుభవం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు తమన్నా. అయితే, నటనతో పాటు కమర్షియల్ హంగులను బ్యాలెన్స్ చేయగలిగిన హీరోయిన్లు మాత్రమే ఇక్కడ 10 నుండి 15 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించగలరని ఆమె విశ్లేషించారు."

ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ మూవీలో మనీష్ పాల్, సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం.. 2026 ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story