అలియా సీరియస్

Alia Gets Serious: సినీ నటి అలియా భట్ ఇటీవల తన ఇంటి ఆవరణలోకి వచ్చిన ఫోటోగ్రాఫర్‌ల పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలియా భట్ ఆగ్రహానికి కారణం తన ఇంటి బయట పికిల్ బాల్ ఆడటానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను వెంబడించారు. ఆమె కారు దిగిన తర్వాత, కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమె అపార్ట్‌మెంట్ గేటు లోపలికి వచ్చి ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో అలియా భట్ చాలా కోపంగా వారిని వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారు. "గేట్ లోపలికి రావద్దు. ఇది మీ బిల్డింగ్ కాదు. దయచేసి బయటకు వెళ్లండి" అని వారిని హెచ్చరించారు.

ఆమె సెక్యూరిటీ సిబ్బంది గేటు మూసివేయడంతో ఫోటోగ్రాఫర్లు బయటకు వెళ్లిపోయారు. ఈ సంఘటనపై చాలా మంది నెటిజన్లు అలియా భట్‌కు మద్దతు తెలిపారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి మీడియా, ఫోటోగ్రాఫర్లు సరైన గౌరవం ఇవ్వడం లేదని, వారి హద్దులు దాటుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవల వార్ 2లో గెస్ట్ రోల్ చేసిన అలియా ప్రస్తుతం అల్ఫా సినిమాలో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story