Trivikram: ఇది హృతిక్ రామ నామ సంవత్సరం: త్రివిక్రమ్
హృతిక్ రామ నామ సంవత్సరం

Trivikram: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వార్ 2 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరై, తనదైన శైలి స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ఆర్లను వింధ్య , హిమాలయ పర్వతాలతో పోల్చి, వీరిద్దరినీ ఒకే సినిమాలో చూడడం రెండు కళ్ళకు సరిపోదని అన్నారు. వీరిద్దరి డాన్స్ చూస్తుంటే మెరుపు తీగల్లా కదులుతున్నారని ప్రశంసించారు.
త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను బంగారంతో పోల్చారు. బంగారాన్ని బీరువాలో దాచిపెట్టకుండా, నగాలుగా చేయించుకుని మెడలో వేసుకోవాలనుకుంటాం అని వ్యాఖ్యానించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఆ కళ బాగా తెలుసని ప్రశంసించారు. తాను సినిమాల్లోకి రాకముందు 'కహో నా ప్యార్ హై' సినిమా చూసి హృతిక్‌కు అభిమానిగా మారానని తెలిపారు.
వార్' సినిమా కన్నా 'వార్ 2' చాలా గొప్పగా ఉంటుందని, సినిమాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని చెప్పారు. గతంలో 'దేవర' సినిమా గురించి మాట్లాడినప్పుడు "దేవర నామ సంవత్సరం" అని అన్నానని, ఇప్పుడు ఈ సంవత్సరం "హృతిక్-రామారావు నామ సంవత్సరం అని ప్రకటించారు.వినాయక చవితి పండగ కంటే ముందే 'వార్ 2'తో పండగ ప్రారంభమవుతుందని అన్నారు.
