Priyanka Chopra: ఆ హీరోలు నన్ను తొక్కేశారు..బాలీవుడ్ పై ప్రియాంకా చోప్రా సంచలన కామెంట్స్
ప్రియాంకా చోప్రా సంచలన కామెంట్స్

Priyanka Chopra: బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుని, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ప్రియాంకా చోప్రా హిందీ పరిశ్రమను ఎందుకు వదిలేశారనే ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక, ఆ సమయంలో బాలీవుడ్‌లో జరిగిన కుట్రలను, ఎదుర్కొన్న తీవ్రమైన అనుభవాలను బయటపెట్టారు.
ఇతరులకు అనుకూలంగా ఉండటానికి, రాజీ పడటానికి తాను ఒప్పుకోలేదని... అందుకే కొందరు అగ్ర హీరోలు తనను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారని ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో 'సలామ్-ఎ-ఇష్క్' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ... మరో సినిమా హీరో సెట్‌కు వచ్చి, 'ఈ పాత్ర నీది కాదు, వేరే హీరోయిన్‌ది.. డైరెక్టర్ పొరపాటున నీకు ఇచ్చాడు' అని చెప్పి ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులు తన జీవితంలో చాలాసార్లు ఎదురయ్యాయని, కానీ స్వయంకృషితోనే తన కెరీర్‌ను నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ద్వారా ప్రియాంకా చోప్రా మళ్లీ భారతీయ వెండితెరపై అలరించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

