ఈ మూడు సినిమాలు ఫిక్స్

Sankranti Movies 2026: 2026 సంక్రాంతికి టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోరు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారికంగా లేదా గట్టిగా రేసులో ఉన్నట్లు ప్రకటించిన ప్రముఖ సినిమాలు మూడు ఉన్నాయి:

ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోహీరోయిన్లుగా మారుతి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం- 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ సినిమాను జనవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇది ఒక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

చిరంజీవి - 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంది, నయనతార హీరోయిన్ గా నటిస్తో్న్న ఈ సినిమాను... దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తుంది ఈ చిత్రం.

ఇక నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తు్న్న చిత్రం - 'అనగనగా ఒక రాజు'. గోదావరి ప్రాంతంలో జరిగే సరదా గ్రామీణ నేపథ్య కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. జనవరి 14వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ మూడు సినిమాలతో పాటు, మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఆ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది రవితేజ - కిషోర్ తిరుమల సినిమా (RT76) చిత్రం కూడా సంక్రాంతికి రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.తమిళ స్టార్ విజయ్ యొక్క చివరి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సంక్రాంతి రేసులో ఉండవచ్చని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story