రవీనా టాండన్ కూతురి టాలీవుడ్ ఎంట్రీ

Raveena Tandon's daughter's Tollywood entry: నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆమె అజయ్ దేవగన్ మేనల్లుడు అమాన్ దేవగన్‌తో కలిసి ఆజాద్ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే తన నటనను ప్రారంభించారు. ఈ సినిమాలోని ఉయీ అమ్మా అనే పాటలో రాషా చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.ఇపుడు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ కూడా హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో రాషా థడానినిన సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. జయ కృష్ణ, రాషా జోడీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌‌‌‌నిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే హీరోయిన్‌‌‌‌పై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రానుందని తెలుస్తోంది. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి.. అక్టోబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అజయ్ భూపతి గతంలో ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి హిట్ చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టాలీవుడ్‌లో కూడా రాషా మంచి విజయం సాధిస్తారని అభిమానులు, సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story