దానికి నేను రెడీ!

Tollywood star heroine Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన పారితోషికంపై వస్తున్న వార్తలపై తాజాగా స్పష్టతనిచ్చారు. పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటిని తానేనని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అదొక అపోహ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. "నేనేమీ హీరోని కాదు కదా అంత ఎక్కువ పారితోషికం తీసుకోవడానికి, కానీ ఆ ప్రచారం నిజమైతే బాగుంటుందని నేనూ కోరుకుంటున్నాను" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

కెరీర్ పరంగా తనకున్న ఆసక్తిని వివరిస్తూ, ప్రత్యేక గీతాల్లో నటించడానికి కూడా తాను సిద్ధమేనని రష్మిక వెల్లడించారు. అయితే దానికి ఒక నిబంధనను కూడా ఆమె విధించారు. తాను హీరోయిన్‌గా చేస్తున్న సినిమాలో అయితేనే ప్రత్యేక పాటలో కనిపిస్తానని చెప్పారు. ఒకవేళ హీరోయిన్ కాకపోయినా ప్రత్యేక గీతం చేయాల్సి వస్తే, పరిశ్రమలోని ముగ్గురు దర్శకుల కోసం ఆ పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఆ ముగ్గురు దర్శకులు ఎవరన్నది మాత్రం రష్మిక సస్పెన్స్‌గా ఉంచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story