ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Tollywood:టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూశారు. నిన్న రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. యజ్ఞం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవికుమార్ చౌదరి. బాలకృష్ణ హీరోగా వీరభద్ర సినిమాను చేశాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా రవికుమార్ చౌదరికి మంచి పేరును తీసుకొచ్చింది. రవికుమార్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం తిరగబడరా స్వామి తిరగబడర సామీ డిజాస్టర్ అయింది. కనీస వసూళ్లను సాధించలేక బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫెయిల్యూర్గా మిగిలింది. నిర్మాతను నష్టాల్లోకి నెట్టేసింది.

ఈ పరిణామం.. ‘తిరగబడర సామీ’ పరాజయంతో ఏఎస్ రవికుమార్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. రవికుమార్ చౌదరి మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం ప్రకటించారు. పిల్లా నువ్వు లేని జీవితం, యజ్ఞం సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చిన మంచి కమర్షియల్ హిట్స్. రవికుమార్ యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో, సౌఖ్యం, లేడీ బ్రూస్ లీ, పిల్లా నువ్వు లేని జీవితం, తిరగబడరా స్వామి. నితిన్ ఆటాడిస్తా, వీరభద్ర సినిమాలకు దర్శకత్వం వహించారు

PolitEnt Media

PolitEnt Media

Next Story