ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కష్టమే..

Tough Weekend for Veeramallu: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత కలెక్షన్లు రాలేకపోతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చినా, రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. అయితే, శనివారం, ఆదివారం వసూళ్లు కాస్త పుంజుకున్నాయి. కానీ పవన్ స్థాయికి తగ్గట్లు కలెక్షన్లు రావడం లేదు. ఆదివారం కేవలం 11 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంటే నాలుగు రోజుల్లో ప్రీమియర్స్ కలిపి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా బడ్జెట్ సుమారు రూ. 250 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.103 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ అవసరం అని, ప్రపంచవ్యాప్తంగా రూ.127-130 కోట్ల షేర్, రూ. 250-260 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే సినిమా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తం వసూళ్లు ఇండియాలో: దాదాపు రూ.75.56 కోట్లు (నెట్)

రోజువారీ వసూళ్లు (అంచనా):

ప్రీమియర్స్ : రూ. 12.7 కోట్లు

మొదటి రోజు : రూ.34.75 కోట్లు

రెండో రోజు: రూ.8 కోట్లు

మూడో రోజు: రూ.9.15 కోట్లు

నాలుగో రోజు : రూ.10.91 కోట్లు

PolitEnt Media

PolitEnt Media

Next Story