‘Toxic’: టాక్సిక్ సెన్సార్ కంప్లీట్.. ఒక్క కట్ లేకుండా A సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
రన్‌టైమ్ ఎంతంటే?

‘Toxic’: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ రివెంజ్ డ్రామా టాక్సిక్ విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి అనుమతి పొందింది. తీవ్రమైన యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ బోర్డు ఎలాంటి కట్స్ విధించకుండా చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేయడం విశేషం. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో సిద్ధమైన ఈ చిత్రం మొత్తం నిడివి 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయింది. కన్నడ వెర్షన్‌లో కేవలం రెండు పదాలను మ్యూట్ చేయడంతో పాటు, పొగతాగడం మరియు మద్యపాన సన్నివేశాల్లో చట్టబద్ధమైన హెచ్చరికలను ప్రదర్శించాలని మాత్రమే బోర్డు సూచించింది.
సాధారణంగా సినిమాల్లో వయోలెన్స్, రొమాంటిక్ సన్నివేశాలపై కఠిన నిబంధనలు పెట్టే సెన్సార్ బోర్డు.. టాక్సిక్ చిత్రానికి దృశ్యాల్లో ఎటువంటి కోతలు లేకుండా క్లియరెన్స్ ఇవ్వడం నెటిజన్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఇది పూర్తిగా పరిణతి చెందిన ప్రేక్షకుల కోసం ఎంతో నిజాయతీగా తీసిన సినిమా అని హీరో యశ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

