‘Toxic First’ Song: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న టాక్సిక్ ఫస్ట్ సాంగ్.. కియారాతో రాకింగ్ స్టార్ తబాహి
కియారాతో రాకింగ్ స్టార్ తబాహి

‘Toxic First’ Song: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం టాక్సిక్. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుండి మేకర్స్ తబాహి పేరుతో సరికొత్త ఫస్ట్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విజువల్స్ పరంగా ఈ పాటను అత్యంత గ్రాండ్‌గా, వింటేజ్ స్టైల్‌లో అద్భుతంగా తెరకెక్కించారు.
తబాహి హైలైట్స్..
ఈ పాటలో రాకింగ్ స్టార్ యశ్ రగ్గడ్ లుక్, కియారా అద్వానీ గ్లామర్ పీక్స్‌లో ఉన్నాయి. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఇంటెన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్, విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. ఈ క్రేజీ సాంగ్ తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించారు.
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడం, నయనతార వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ యాక్షన్ డ్రామాపై వరల్డ్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

