కియారా కోసం

Kiara Advani: కన్నడ స్టార్ నటుడు యష్ కొత్త ప్రాజెక్టు 'టాక్సిక్’ కోసం మరింత ఆసక్తికరంగా ప్రిపేర్ అవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. యష్ బర్త్డే స్పెషల్గా విడుదలైనగ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కియారా గర్భవతైంది. కియారాకు షూటింగ్ షెడ్యూల్ సులభంగా ఉండాలనే ఉద్దేశంతో, యష్ తన భాగమైన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగు, బెంగళూరు నుంచి ముంబైకి మార్చాలని నిర్ణయించారట. దీంతో ఆమెకు ప్రయాణ బాధ్యత తగ్గింది. ముంబైలోనే యష్ - కియారాల మధ్య సన్నివేశాలను, త్వరగా షూట్ చేసి పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు వచ్చాక, యష్ సెన్సిటివిటీ, సహనభావం చూసిన ప్రేక్షకులు, అభి మానులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated On 19 Jun 2025 5:50 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story