‘Toxic’: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'టాక్సిక్/ "ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్" అనే శీర్షికతో వస్తున్న ఈ సినిమాపై నిర్మాత కె. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విడుదలైన ప్రమోషనల్ వీడియోల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉన్నాయంటూ నెట్టింట ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నిర్మాత క్లారిటీ ఇచ్చారు. "టాక్సిక్ అనేది సాధారణ కథ కాదు. భారీ స్థాయిలో, ఇప్పటివరకు తాము చేయని ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్నాం" అని తెలిపారు.

థియేటర్లలో ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా అభినందిస్తారన్న ధీమా వ్యక్తం చేసిన ఆయన... 'టాక్సిక్' కేవలం పెద్దల కోసం మాత్రమే రూపొందించిన ఒక కల్పిత కథ అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, యశ్-తారా సుతారియా మధ్య తెరకెక్కించిన 'మనసాగదే..' పాట ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story