ఇంట్లో విషాదం

Tragedy at Singer S. Janaki’s Home: లెజెండరీ సింగర్ ఎస్. జానకి గారి కుమారుడు మురళీకృష్ణ మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారని సమాచారం. జానకి గారు గత కొన్నేళ్లుగా తన కుమారుడితోనే కలిసి ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు, కంటికి రెప్పలా చూసుకునే కొడుకు దూరం కావడం తీరని లోటుగా మిగిలిపోయింది.

మురళీకృష్ణ కేవలం జానకి గారి కుమారుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న కళాకారుడు. అంతేకాకుండా, కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు. జానకి గారు పాటలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఆమె బాగోగులన్నీ మురళీకృష్ణే దగ్గరుండి చూసుకునేవారు.

మురళీకృష్ణ మరణంపై ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. "మురళీ అన్న మరణ వార్త విని నేను షాక్ అయ్యాను. మేము ఒక మంచి సోదరుడిని కోల్పోయాము. ఈ కష్ట సమయంలో జానకి అమ్మకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మురళీకృష్ణకు భార్య ఉమ మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story