✕
Tragedy in Allu Family: అల్లు ఫ్యామిలీలో విషాదం..అరవింద్ తల్లి కన్నుమూత
By PolitEnt MediaPublished on 30 Aug 2025 5:32 PM IST
అరవింద్ తల్లి కన్నుమూత

x
Tragedy in Allu Family: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ(94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి.
నానమ్మ చనిపోయినా విషయం తెలియగానే ముంబైలో సినిమా షూటింగ్ పనుల్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. రామ్ చరణ్ మైసూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు. మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హైదరాబాదుకు చేరుకుంటున్నారు. అల్లు అరవింద్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

PolitEnt Media
Next Story