Tragedy in the Film Industry: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య

Tragedy in the Film Industry: కన్నడ బుల్లితెర పరిశ్రమలో ఇటీవల మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ, తమిళ సీరియల్ నటి నందిని) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని కెం గేరి (Kengeri) ప్రాంతంలో ఆమె ఉంటున్న పీజీ (PG) గదిలో నందిని ఉరివేసుకుని కనిపించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ , డైరీ ఆధారంగా.. కుటుంబ సమస్యలు , కెరీర్ పరమైన ఒత్తిడి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం ఆమెకు ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అయితే నందినికి నటన అంటే ఇష్టం ఉండటంతో ఆ ఉద్యోగం చేయడానికి నిరాకరించారు. దీనిపై కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినట్లు, అలాగే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి పెరగడం వల్ల ఆమె మానసిక వేదనకు గురైనట్లు సమాచారం.
ఆమె కన్నడ , తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.జీవహూవాగిదె ,సంఘర్ష ,మధుమగలు ,తమిళంలోప్రస్తుతం ఆమె 'గౌరి' (Gowri) అనే సీరియల్‌లో దుర్గ, కనక అనే ద్విపాత్రాభినయం చేస్తున్నారు.విచారకరమైన విషయం ఏంటంటే, ఆమె నటిస్తున్న గౌరి సీరియల్ లో ఇటీవల ఆమె పాత్ర ఆత్మహత్యాయత్నం చేసే సన్నివేశం ప్రసారమైంది. అయితే, ఆ సీరియల్ కథకు, ఆమె వాస్తవ జీవిత నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

