KD Director Passes Away: టాలీవుడ్ లో విషాదం..కేడీ దర్శకుడు కన్నుమూత
కేడీ దర్శకుడు కన్నుమూత

KD Director Passes Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిన్న మరో విషాదం చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' (Kedi) చిత్ర దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) అనారోగ్యంతో కన్నుమూశారు.
గత కొంతకాలంగా కిరణ్ కుమార్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (Stomach Infection) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2010లో నాగార్జున హీరోగా వచ్చిన 'కేడీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
నేటి పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్), కిరణ్ కుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కిరణ్ కుమార్ మృతిపై సందీప్ రెడ్డి వంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇటీవల విజయ్ ఆంటోనీ నటించిన 'భద్రకాళి' సినిమాలో ఆయన సీబీఐ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు.సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత ఆయన 'KJQ' (కింగ్ జాకీ క్వీన్) అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దురదృష్టవశాత్తూ సినిమా విడుదల కాకముందే ఆయన మరణించడం చిత్ర బృందాన్ని కలిచివేసింది.

