కోటకు నివాళి

Tribute to Kota Srinivasa Rao: 2026 ఆస్కార్ (98వ అకాడమీ అవార్డ్స్) వేదికపై దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు గారికి అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది కాలంలో మరణించిన ప్రపంచ ప్రఖ్యాత సినీ ప్రముఖులకు అకాడమీ నివాళి అర్పించింది. ఇందులో కోట శ్రీనివాసరావు ఫోటోను ప్రదర్శించారు. కోటతో పాటటు బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.గతంలో భానుమతి గారు, సత్యజిత్ రే వంటి భారతీయ దిగ్గజాలకు మాత్రమే దక్కిన ఈ గౌరవం ఇప్పుడు కోటకి దక్కడం విశేషం.

ఎందుకు ఈ నివాళి?

కోట శ్రీనివాసరావు గారు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, తన దశాబ్దాల కెరీర్‌లో 750కి పైగా చిత్రాల్లో నటించి, భారతీయ సినిమా గమనాన్ని ప్రభావితం చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ చిత్రాలలో ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు అకాడమీ దృష్టిని ఆకర్షించాయి.ఆస్కార్ వేదికపై కోట ఫోటో కనిపించగానే సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఒక గొప్ప నటుడికి దక్కాల్సిన అసలైన గౌరవం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతి గ్లోబల్ స్థాయిలో ఎంతలా పెరిగిందో ఇది మరోసారి నిరూపించిందని పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కోట శ్రీనివాసరావు750కి పైగా (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం),ప్రధాన పురస్కారాలు పద్మశ్రీ (2015), 9 నంది అవార్డులు లభించాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story