Trisha: విజయ్ బర్త్‌డే వివాదానికి త్రిష చెక్.. ఒక్క ఫోటోతో రూమర్స్‌కు ఎండ్ కార్డ్!
ఎండ్ కార్డ్!

Trisha: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. అయితే, అందరి కళ్లూ ఒక్కరిపైనే పడ్డాయి. ఆయనే.. విజయ్ క్లోజ్ ఫ్రెండ్ త్రిష.రోజంతా గడిచినా త్రిష నుంచి ఎలాంటి విష్ రాకపోవడంతో.. నెట్టింట ఒకటే చర్చ మొదలైంది. "అదేంటి త్రిష ఇంకా విష్ చేయలేదు?", "కారణం వేరే ఏమైనా ఉందా?" అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇవి చాలదన్నట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేసిందనే వార్త ఈ చర్చలకు మరింత ఘాటును పెంచింది.
లేటుగా వచ్చినా.. లేటెస్ట్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. విజయ్ పుట్టినరోజు ముగిసే సమయానికి ఆయనతో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను త్రిష షేర్ చేశారు. విజయ్ ఎదురుగా బర్త్‌డే కేక్స్ ఉంచి.. ఆయన్నే ప్రేమగా చూస్తున్న ఆ ఫోటోను పంచుకుంటూ.. "వీటన్నింటి విలువ పెంచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టారు. అయితే, త్రిష పంచుకున్న ఈ ఫోటో కొత్తదా? లేక పాతదా? అన్నది పక్కన పెడితే.. మొత్తానికి త్రిష ఇచ్చిన ఈ సడన్ సర్ప్రైజ్ చూసి విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రూమర్స్ అన్నింటికీ ఒక్క ఫోటోతో ఎండ్ కార్డ్ పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

