Trisha Krishnan: దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'ఎవర్ గ్రీన్ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో ఇంటర్నెట్ అంతా త్రిష ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆమెకు విషెస్ చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు.

తనపై కురుస్తున్న ఈ అపారమైన ప్రేమను చూసి త్రిష ఎంతో మురిసిపోయారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. "నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీ అందరి ఆశీస్సుల ముందు నేను వినమ్రంగా తలవంచుతున్నాను" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

పుట్టినరోజు సందర్భంగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తురాలిలా స్వామివారి సేవలో పాల్గొన్న ఆమెకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శనానికి వెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన త్రిష.. తిరుమల కొండలు తన "హ్యాపీ ప్లేస్" అని, అక్కడ తనకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.వయసు పెరుగుతున్నా తన గ్లామర్‌తో, నటనతో కుర్రకారును మాయ చేస్తున్న త్రిష.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story