Trisha Krishnan Takes a Dig at “Karuppu” Team: సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న "కరుప్పు" చిత్ర బృందంపై త్రిష చేసిన సోషల్ మీడియా కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఈ సినిమా నుండి త్రిష 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ వీడియో విడుదలైనప్పటికీ, ప్రమోషన్ల విషయంలో తనను విస్మరిస్తున్నారన్నట్లుగా ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. "మీరు ఈ సినిమాలో ఉన్న విషయమే మర్చిపోయాం" అని ఒక అభిమాని చేసిన కామెంట్‌కు త్రిష స్పందిస్తూ, "థాంక్యూ.. నిజానికి నాకూ గుర్తే లేదు, ఇప్పటికైనా వాళ్ళు గుర్తు చేసినందుకు సంతోషం" అంటూ వెటకారంగా బదులివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అంతేకాకుండా, ఏప్రిల్ 26న చెన్నైలో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ వేడుకకు త్రిష గైర్హాజరు కావడంపై కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. తనకు ఆహ్వానం అందలేదా అని అడిగిన నెటిజన్‌కు, "బహుశా నాకు పంపిన ఇన్విటేషన్ పోస్ట్‌లో ఎక్కడో మిస్ అయినట్లుంది" అంటూ చిత్ర యూనిట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం పోస్టర్లపై పేరు వేస్తే సరిపోదని, సరైన ఆహ్వానం అందలేదని ఆమె మాటల ద్వారా స్పష్టమవుతోంది.

మరోవైపు తన పుట్టినరోజు మే 4న ఉండటంతో, బ్లాక్ బ్యాక్‌లెస్ డ్రెస్సులో ఉన్న ఒక గ్లామరస్ ఫోటోను షేర్ చేస్తూ "మే(మీ) సీజన్ మొదలైంది" అంటూ త్రిష సందడి చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఆమె పుట్టినరోజు రోజే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో ఈ తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తున్న ఫలితాలు కావడంతో, త్రిష బర్త్‌డే మరియు ఎలక్షన్ రిజల్ట్స్ మధ్య నెటిజన్లు రకరకాల లింకులు పెడుతూ ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story