Trisha Krishnan Visits Tirumala: తమిళనాడు రిజల్ట్స్.. తిరుమలలో త్రిష.. అసలు ఏం జరుగుతోంది?
తిరుమలలో త్రిష.. అసలు ఏం జరుగుతోంది?

Trisha Krishnan Visits Tirumala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. అటు చెన్నైలో టెన్షన్ నెలకొంటే, ఇటు తిరుమలలో త్రిష శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తెల్లవారుజామునే సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక కేవలం భక్తి మాత్రమే ఉందా? లేక రాజకీయ సమీకరణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
ముఖ్యంగా గత కొన్నాళ్లుగా తమిళనాట ఒకటే రచ్చ! టీవీకే (TVK) అధినేత, దళపతి విజయ్ - త్రిష రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో భారీ దుమారం రేగింది. అదే సమయంలో విజయ్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఈ అంశం ప్రత్యర్థుల చేతిలో అస్త్రంగా మారడం.. రచ్చ రంభోలా అవ్వడం మనం చూశాం."
గతంలో ఎన్నికల ప్రచార హోరు సాగుతున్న సమయంలోనే త్రిష ఒకసారి తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు ఫలితాల రోజే ఆమె కొండపై కనిపించడం ఆసక్తికరంగా మారింది. తన పుట్టినరోజు కావడంతో పాటు, అటు రాజకీయంగా విజయ్ పార్టీ భవితవ్యం తేలే సమయం కావడంతో.. విజయ్ విజయం కోసమే త్రిష ఈ ప్రత్యేక పూజలు చేశారా? అన్నది అభిమానుల సందేహం.
ప్రస్తుతం త్రిష తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజకీయ సెగలు ఒకవైపు.. ఆధ్యాత్మిక పర్యటనలు మరోవైపు.. వెరసి త్రిష తిరుమల యాత్ర ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ కేక్ లా మారింది.

