కోర్టుకెళ్లిన ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ 'డ్యూడ్' (Dude) సినిమా నిర్మాతలపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.'డ్యూడ్' చిత్రంలో తాను స్వరపరిచిన రెండు పాటలను (ముఖ్యంగా 'పుదు నెల్లు పుధు నాతు' వంటి పాటలను) తన అనుమతి లేకుండా చిత్ర బృందం ఉపయోగించిందని ఇళయరాజా ఆరోపిస్తున్నారు. ఇది కాపీహక్కుల (Copyright) ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.ఈ విషయంలో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

Trouble for ‘Dude’: ఇళయరాజా అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు అంగీకరించి, సినిమా నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్), అలాగే ఆడియో హక్కులు కలిగి ఉన్న సోనీ మ్యూజిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మరో చిత్రం ('గుడ్ బ్యాడ్ అగ్లీ') విషయంలోనూ ఇలాంటి వివాదం వచ్చినప్పుడు, వారు సోనీ మ్యూజిక్ నుంచి పాటల హక్కులను డబ్బు చెల్లించి తీసుకున్నామని, ఇళయరాజా కేసు సోనీ మ్యూజిక్‌పై అని వాదించారు. అయితే ఇళయరాజా మాత్రం తన అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా తన పాటలను వాడుకోవడం అన్యాయం అని వాదిస్తున్నారు. దీంతో 'డ్యూడ్' చిత్రంపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story