Manchu Lakshmi Sensational Comments: తమ్ముళ్లను విడదీయాలని చూస్తే నాశనమే.. మంచు లక్ష్మీ సంచలన కామెంట్స్..
మంచు లక్ష్మీ సంచలన కామెంట్స్..

Manchu Lakshmi Sensational Comments: నటి, నిర్మాత మంచు లక్ష్మి తమ కుటుంబంలో జరుగుతున్న విభేదాల ప్రచారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తన సోదరులైన మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్న మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు నాశనమైపోతారంటూ ఆమె సంచలన శాపనార్థాలు పెట్టారు. మనోజ్ సినిమా మిరాయ్ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను కొన్ని సంస్థలు కత్తిరించి, వక్రీకరించి ప్రచారం చేశాయని మంచు లక్ష్మి మండిపడ్డారు.
తాను విష్ణు గురించి మాట్లాడకపోయినా, అతడిని తిట్టినట్లుగా తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి చూపించారని ఆమె ఆరోపించారు. "తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ నాశనం అవుతారు.. మీ కర్మ మీరే అనుభవిస్తారు" అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కూతురిని విష్ణు స్కూల్ నుంచి మాన్పించడానికి కారణం ఇదే:
తన కుమార్తె విద్యా నిర్వాణ విష్ణుకు చెందిన స్కూల్‌లో చదివేదని, కానీ అక్కడ అందరూ తనపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, సేవలు చేయడంతో ఆమె విలాసవంతమైన జీవితానికి అలవాటవుతున్నట్లు గమనించానని లక్ష్మి వివరించారు. అది తన కూతురి భవిష్యత్తుకు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ నుంచి మాన్పించి.. మరో చిన్న పాఠశాలలో చేర్పించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్లు బాధపడ్డా, తన కూతురి భవిష్యత్తు కోసమే ఈ పని చేశానని ఆమె పేర్కొన్నారు.
మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య విభేదాలు, మనోజ్ ఇంటి నుంచి బయటకు రావడం వంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ కుటుంబ వ్యవహారాలపై మంచు లక్ష్మి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

