TVK Chief Vijay: విడాకుల కోసం కోర్టుకెక్కిన..టీవీకే చీఫ్ విజయ్ భార్య
టీవీకే చీఫ్ విజయ్ భార్య

TVK Chief Vijay: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త విజయ్‌కు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే తనకు విడాకులు కావాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయ్ నుంచి శాశ్వత భరణంతో పాటు నివాస హక్కును ఆమె కోరారు. 27 ఏండ్ల క్రితం సంగీత, విజయ్ వివాహం జరిగింది. వారికి కుమారుడు జాసన్ సంజయ్ (25), కుమార్తె దివ్య సాషా (20) ఉన్నారు. కాగా, విడాకుల పిటిషన్‌పై విజయ్ ఇంకా స్పందించలేదు.
సంగీత లండన్‌కు చెందిన శ్రీలంక తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటనను ఇష్టపడే ఆమె, 1996లో ఆయనను కలవడానికి చెన్నై వచ్చారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. వీరి వివాహం 1999, ఆగస్టు 25న జరిగింది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వీరి కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం కెనడాలో సినిమా మేకింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. సందీప్ కిషన్ హీరోగా సినిమా మొదలు పెట్టాడు. దివ్య సాష: కుమార్తె. బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కలిగి ఉన్నారు.

