రెండు వారాల రెస్ట్..

NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయంపై ఆయన టీమ్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ సమయంలో ఆయన కిందపడటంతో కాలికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు.అభిమానులు, మీడియా అనవసరమైన ఊహాగానాలు నమ్మొద్దని కూడా ఎన్టీఆర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రస్తుత్తం జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నారు.
