అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్

Allu Arjun Shares an Emotional Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగాసోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.పుష్ప ఫ్రాంచైజీ మా జీవితంలో ఐదేళ్ల పాటు సాగిన మరువలేని ప్రయాణం.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ, మా కళను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన ధైర్యాన్ని అందించింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము.నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ముఖ్యంగా మా కెప్టెన్ సుకుమార్ తో కలిసి ఈ ప్రయాణంలో నడవడం నాకు దక్కిన గొప్ప గౌరవం."

"ఈ ప్రయాణంలో భాగమైన మీ ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి, హృదయం నిండా కృతజ్ఞతతో... ధన్యవాదాలు.ఆయన ఈ పోస్ట్‌తో పాటు, దర్శకుడు సుకుమార్ తో 'పుష్ప 2' సెట్స్‌లో చర్చిస్తున్న ఒక ఫోటోను కూడా పంచుకున్నారు. 'పుష్ప 2: ది రూల్' చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ రూ.1228 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పుష్ప 2 సత్తా చాటింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో పుష్ప 2 నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story