ఉపేంద్ర రీ రిలీజ్

Upendra Re-Release: కన్నడ నటుడు ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ సినిమా 'ఉపేంద్ర. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రీ-రిలీజ్ అవుతోంది.అక్టోబర్ 11 ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri Movie Distributors) విడుదల చేస్తున్నారు. 1999లో విడుదలైన ఈ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్, అప్పట్లో ఒక సంచలనం.

ఈ మూవీలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నప్పటికీ సినిమా బాగుందని ప్రశంసలు వచ్చాయి. దీంతో యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఉపేంద్ర పాటలు కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ అయ్యాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ సోషల్‌మీడియాలో వైరల్ ​ అవుతూనే ఉంటాయి. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది. రీ-రిలీజ్‌కి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది టీం. దీనికి మంచి స్పందన లభించింది. ది గెట్ రెడీ ఫర్ మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ది కల్ట్ క్లాసిక్ ఉపేంద్ర మళ్లీ వస్తోంది అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాను కొత్త తరం ప్రేక్షకులు కూడా థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story