స్టెప్పేస్తే భూకంపం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రాబోతున్న మరో క్రేజీ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోర్షన్ పూర్తికాగా, త్వరలోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్‌‌‌‌లెంగే సాలా..’ అంటూ విడుదల చేసిన ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌‌‌‌లో మెస్మరైజింగ్‌‌‌‌ స్టెప్పులతో ఇంప్రెస్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్‌‌‌‌గా కంపోజ్ చేయగా, భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. విశాల్ దడ్లాని పాడాడు. ఫుల్ సాంగ్‌‌‌‌ డిసెంబర్ 13న విడుదల చేయనున్నామని, ఇది అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వనుందని మేకర్స్ తెలియజేశారు.

గబ్బర్‌సింగ్‌ లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన పవన్‌ కల్యాణ్‌- దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్.. సినిమా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో హింట్ ఇచ్చి, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story