'Ustad Bhagat Singh' movie: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న.. దేఖ్ లేంగే సాలా
దేఖ్ లేంగే సాలా

'Ustad Bhagat Singh' movie: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోని "దేఖ్ లేంగే సాలా సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.సరికొత్త రికార్డును నెలకొల్పింది. 24 గంటల్లో సాధించిన 29.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఇది ఒకే భాషలో (తెలుగులో) విడుదలైన లిరికల్ పాటల్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. అంతకుముందు రామ్ చరణ్ సినిమాలోని "చికిరి" పాట పేరిట ఉన్న రికార్డును ఈ పాట బద్దలు కొట్టింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ , డ్యాన్స్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, విశాల్ దద్లానీ గానం, భాస్కరభట్ల సాహిత్యం దీని విజయంలో కీలక పాత్ర పోషించాయి.
పవన్ ,హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఈమూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. పవన్ కళ్యాణ్ తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇంకా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.ఈ సినిమా తమిళంలో విజయ్ నటించిన 'తెరి' సినిమాకు రీమేక్ అని మొదట్లో వార్తలు వచ్చినా, దర్శకుడు హరీష్ శంకర్ ఇది కొత్త కథతో వస్తున్న సినిమా అని స్పష్టం చేశారు.
ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితేఈ చిత్రం 2026 మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ప్రేక్షకులకు అనుకూలమైన తేదీని చూసి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

