Vadde Naveen’s Grand Comeback: వడ్డే నవీన్ గ్రాండ్ కమ్‌బ్యాక్.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అదిరిందిగా!
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అదిరిందిగా!

Vadde Naveen’s Grand Comeback: టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ గుర్తున్నారా? 'పెళ్లి', 'మనసిచ్చి చూడు' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వడ్డే నవీన్.. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ.. తనకు నచ్చిన కథలు రాకపోవడం వల్లే ఇన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్నానని స్పష్టం చేశారు. దర్శకుడు కమల్ తేజ చెప్పిన కంటెంట్ చాలా కొత్తగా ఉండటంతోనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేశానని చెప్పారు. ఇందులో తను ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సరికొత్తగా కనిపించబోతున్నానని, హై క్వాలిటీ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని వడ్డే నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన కమల్ తేజ నార్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశామని, తన డెబ్యూ మూవీ ఇంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదన్నారు. పూరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఒక రోజొస్తుందని కలలు కన్నానని.. వడ్డే నవీన్ గారికి ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తను 'లక్ష్మి' అనే కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించింది.
కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వడ్లమాని శ్రీనివాస్, సాయి కిరణ్, సాత్విక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ లాంచ్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్ర యూనిట్.. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది. ఈ సస్పెన్స్ డ్రామాను జూన్ 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

